జగన్ పాలనలో దేవుడిని కూడా దర్శించుకునే స్వేచ్ఛ లేకుండా పోయిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. టీడీపీ నేతల గృహ నిర్బంధం దుర్మార్గమన్నారు. తమ పార్టీ అధినేత జైలు నుంచి బయటకు రావాలని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రార్థించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నారన్నారు. ఇది మత విశ్వాసాలను అవమానించడమే అన్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దేనికి సంకేతం? అధికార పార్టీకి ఒక రూలు ప్రతిపక్షాలకు మరో రూలా? రాష్ట్రమంతా పోలీస్ చట్టం ఉంటే ముఖ్యమంత్రి తిరుపతిలో సభ ఎలా పెట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి అని నిలదీశారు. టీడీపీ నేతలు ఎక్కడైనా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేకం కార్యాకలాపాలకు పాల్పడ్డారా.? అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హద్దులు దాటి అణచివేతకు గురిచేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా రాజారెడ్డి రాజ్యాంగాన్నే అమలు చేస్తామంటే కుదరదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ నేతలను గృహ నిర్భంధాలు చేయడం ఇకనైనా మానుకోవాలి అని యనమల రామకృష్ణుడు సూచించారు.