అర్హులైన వారందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే : కేటీఆర్

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ అనేది అత్యంత పారదర్శకంగా జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని సూచించారు. ఇవాళ కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో రెండో విడుత డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ లో దాదాపు లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామని.. అందులో 30వేల ఇండ్ల పంపిణీ ఇవాళ్టితో పూర్తి అవుతుందని తెలిపారు. మిగిలిన 70వేల డబుల్ బెడ్ రూండ్ల ఇళ్లను రాబోయే నెల రోజుల్లో పేదలకు అందిస్తామని తెలిపారు.

సొంతంగా ఇల్లు కట్టాలన్నా.. ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నా పేదలకు చాలా కష్టమన్నారు. పాతకాలంలో ఈ సామెత చెప్పేవారు కానీ ఇవాళ తెలంగాణలో ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా.. ఆడబిడ్డకు మేనమామలా సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వానికి రూ.10లక్షల ఖర్చు అయిందని తెలిపారు. జగద్గిరి గుట్ట డివిజన్ 126వ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకి తొలి విడుతలో డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్ లో బీజేపీ నాయకురాలు సునితకు కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు వచ్చిందని వెల్లడించారు. దేశంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వాలున్నాయా ? అని ప్రశ్నించారు. కొత్త లింక్ రోడ్లు, బ్రహ్మాండమైన నాలాలు నిర్మిస్తున్నాం. ప్రజలు, రైతులపై కేసీఆర్‌ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news