అక్టోబర్ 5వ తేదీ నుండి ఇండియా లోని 10 వేదికలలో వన్ డే వరల్డ్ కప్ ఎంతో అట్టహాసంగా జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేసింది. ఈ వరల్డ్ కప్ కు మొత్తం 10 జట్లు అర్హత సాధించగా… వీటి మధ్యనే భీకరమైన పోటీ ఉండనుంది. ఇండియా లో మ్యాచ్ లు జరుగుతున్నందున ఆసియా దేశాలకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫేవరెట్ లుగా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ లు ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వరల్డ్ కప్ ను గెలుచుకున్న జట్టుకు 4 మిలియన్ ల అమెరికా డాలర్లు అనగా భారతీయ కరెన్సీ లో 33 కోట్ల 17 లక్షలు బహుమతిగా యివ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
ఇక రన్నర్ అప్ గా నిలిచినా జట్టుకు అందులో సగం అంటే 2 మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ లో 16 కోట్ల 58 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. మరి ఎవరు విజేతగా నిలిచి ఈ బహుమతిని సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.