చంద్రబాబు, అచ్చెన్నా దోమలపై దండయాత్రలు చేసుకోండంటూ వైసీపీ పార్టీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి చురకలు అంటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడద లేదని, లార్వా ఆనవాళ్లే లేవని జైళ్ల డిఐజినే చెప్పారే అంటూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి. బహుశా దోమలపై దండయాత్ర పేరుతో నిధులు మింగేశారన్న కోపంతో దోమలు బయట నుంచి వచ్చి కుట్టేసి పోతున్నాయేమో!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బెయిల్ పిటిషను రద్దయితే లోపలకు వెళ్లి ఇద్దరూ కలిసి జైలులో దోమలపై దండయాత్రలు కొనసాగింవచ్చు మరి అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ పార్టీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఇక మరో ట్వీట్ లో సెల్ ఫోను, కంప్యూటర్, మాజికల్ రింగే కాదు…విద్యుత్తు బల్బు, విమానం, నౌకలాంటి మరికొన్నింటిని కూడా చంద్రబాబు గారే కనిపెట్టి…అల్జిమర్స్ వ్యాధి ముదరడంతో వాటిని కనిపెట్టిన విషయమే మర్చిపోయారని అంటోంది పచ్చకుల మీడియా అని ఆగ్రహించారు. వాటిపైనా పేటెంట్ హక్కుల కోసం ట్రై చేయవచ్చు కదా బాబు గారూ! అంటూ చురకలు అంటించారు వైసీపీ పార్టీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి.