హైదరాబాద్ నగరంలో హత్యలు, దాడులు రోజుకు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏ సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందోనని ప్రధానంగా శివారు ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని అమేజాన్ బిల్డింగ్ సమీపంలో యువకుడు అత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది.
ప్రధానంగా ఓయువకుడు చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డడాడు. ఈ ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హరియానాకు చెందిన పర్వేజ్ (22) గా గుర్తించారు పోలీసులు. ఎయిర్ పోర్ట్ లోని అమేజాన్ కంపనీలో తాత్కాలిక డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు స్థానికులు అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి చెందిన మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఉండటం చూసి ఎవ్వరూ చూసిన ఈ విషయం గురించే చర్చించుకోవడం గమనార్హం.