తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. అక్టోబర్‌ 24 నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ !

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త..  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అక్టోబర్ 24న దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేలకు పైగా బడుల్లో ప్రారంభిస్తారు. 23 లక్షలపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేయకుండా, మోడల్ స్కూళ్లు, మదర్సాలు, ఏయిడెడ్ పాఠశాలల్లోనూ అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది.

BreakFast scheme on oct 24th
BreakFast scheme on oct 24th

రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ స్కూళ్లు 642, మోడల్ స్కూళ్లు 194, మదర్సాలు 100 ఉన్నాయి. వీటిల్లో 1.50 లక్షలకు పైగా విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నది. విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన విద్యను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మానవీయ కోణంలో పోషకాహారాన్ని అందించేందుకు ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఉదయాన్నే విద్యార్థుల ఆకలి బాధలను తీర్చాలన్న సంకల్పంతో అల్పాహార పథకాన్ని అమలు చేయనున్నది. విద్యార్థుల చదువుల పట్ల ఏకాగ్రత పెంచడం, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదన్న ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నది.

Read more RELATED
Recommended to you

Latest news