దేశానికి గవర్నర్ పోస్టులు అవసరమా..? మంత్రి కేటీఆర్

-

తెలంగాణకు చెందిన ఇద్దరూ ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సత్యానారాయణలు ఎంపిక చేయకుండా రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మేడమ్ మామీద ఎంత కోపం ఉందో శ్రవణ్ మీద ఉండదనుకున్నాం. ఉద్యమంలో పాల్గొన్న గవర్నర్ అవ్వక ముందు బీజేపీ అధ్యక్షురాలుగా పని చేశారు. మీకు రాజకీయాలతో సంబంధాలు లేవా.? దేశానికి గవర్నర్ లాంటి వారు అవసరమా..? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. 

సర్కారియా కమిషన్ ను తుంగలోకి తొక్కింది ఎవరు?  సుప్రీంకోర్టు సీజేఐ రంజన్ గొగొయ్ ను రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారు. జ్యోతిరాధిత్య రాజ్యసభకు ఎలా నామినేట్ చేశారు.  ఇలా ఒక్కరూ కాదు.. చాలా మందిని పెద్దల సభకు పంపారు. బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న వారిని తెలంగాణ కేబినేట్ నామినేట్ చేసిందని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. గవర్నర్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీపై కూడా నిప్పులు చెరిగారి మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news