భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఇవాళ టీడీపీ ఎంపీలు కేశినాని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ లతో కలిసి లోకేష్ రాష్ట్రపతిని కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పాలన, ప్రతిపక్షాల అణిచివేతపై రాష్ట్రపతికి వివరించారు లోకేష్.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ పేరును సీఐడీ చేర్చింది. ఈ మేరకు కేసులో ఆయన పేరును చేరుస్తూ.. ఇవాళ ఏసీబీ కోర్టులో మెమోదాఖలు చేసింది. ఈ కేసులో లోకేష్ పేరును చేర్చేందుకు ఉన్న ఆధారాలు ఏంటి ? ఏ కోణంలో చేర్చారు? అనే విషయాలపై సీఐడీ వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ పేర్లను సీఐడీ చేర్చింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరుగనుంది.