మంత్రి కేటీఆర్ కు నారా లోకేష్ ఫోన్ !

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన అంశమని.. ఆంధ్రా పంచాయితీ అక్కడే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.  తాను జగన్,  లోకేష్, పవన్ కళ్యాణ్  కి మిత్రుడిని అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.  లోకేష్ నాకు ఫోన్ చేసి ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు. తెలంగాణలో ఇవాళ ఒకరు ర్యాలీ చేస్తే రేపు మరొకరు చేస్తారు అని చెప్పినట్టు గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. 

పక్కింటి పంచాయితీ కూడా ఇక్కడ తేల్చకుంటారా ? రాజమండ్రి దద్దరిల్లేలా అక్కడే ర్యాలీలు నిరసనలు చేసుకోండి.   విజయవాడలో, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు చేయండని.. ఒకరితో మరొకరు తలపడండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఐటీ కారిడార్ లో ఆందోళనలు జరగలేదు.  ఆంధ్రా పంచాయితీలకు తెలంగాణ వేదిక కానివ్వమని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న  యుద్ధం అని.. మా పార్టీ నేతలు స్పందిస్తే వారి వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపించే అంశం కాదు.. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఏపీలో.. ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే అక్కడే చేయండి. ఎవ్వరూ అడ్డుకోరు. అక్కడ చేయకుండా ఇక్కడ రాజకీయ రాద్దాంతం చేస్తానంటే ఎలా..? అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news