ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ లో రూ.114 కోట్లు కొట్టేశారు.. మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ స్కామ్ లో రూ.114 కోట్లు కొట్టేశారంటూ ఆరోపించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏపీ అసెంబ్లీలో ఫైబర్ నెట్ స్కామ్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు తనకు తెలిసిన వారికే ఫైబర్ నెట్ టెండర్లు కట్టబెట్టారని పేర్కొన్నారు. హెరిటేజ్ లో పని చేసే వారే టెరాసాప్ట్ లో డైరెక్టర్లుగా పని చేశారని విమర్శించారు. ఫైబర్ నెట్ స్కామ్ మొత్తం చంద్రబాబు కను సన్నల్లోనే జరిగాయి అన్నారు. రూ.330 కోట్ల కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు. ః

అందులో దాదాపు రూ.114 కోట్లను కొట్టేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఈ స్కామ్ ఎలా జరిగిందో అసెంబ్లీలో ఓ టేబుల్ ను డిస్ ప్లే చేశారు మంత్రి అమర్నాథ్. ప్రభుత్వంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపిందన్నారు. సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తీసుకొస్తామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి  పెట్టుబడి రాలేదన్నారు.  చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులకే ఫైబర్ నెట్ టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నారు. షేల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news