షాకింగ్‌ : ఆనంద్‌ మహీంద్రాపై చీటింగ్‌ కేసు

-

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. సామాన్యులకు కూడా పరిచయమే. బడా బిజినెస్‌మ్యాన్‌గా ఊపిరిసలపని పనులతో బిజీగా ఉన్నప్పటికి.. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. లోకల్‌ టాలెంట్‌కు సంబంధించి.. ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వచ్చే ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. చాలా మందికి తమ కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇక ఆనంద్‌ మహీంద్రా అనగానే సామాన్యులకు వెంటనే గుర్తుకు వచ్చేది.. సోషల్‌ మీడియాలో ఆయన చేసే పోస్టులే. అయితే ప్రస్తుతం మాత్రం అందుకు రివర్స్‌ సన్నివేశం ఒకటి వెలుగు చూసింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా మీద కేసు నమోదు చేశారు పోలీసులు. తన కుమారుడి మరణానికి కారణమయ్యాడంటూ.. ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఆనంద్‌ మహీంద్రాపై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

These 15 inspiring quotes by Anand Mahindra will guide you towards success

యూపీకి చెందిన రాకేశ్‌ మిశ్రా 2022లో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో (Scorpio)ను తన కుమారుడు అపూర్వ్‌కు కొనిచ్చాడు. దాని విలువ అప్పుడు రూ. 17.39 లక్షలు. దీంతో 2022 జనవరి 14 వ తేదీన అపూర్వ్‌ తన స్నేహితులతో కలిసి కొత్తకారులో లక్నో నుంచి కాన్పూర్‌ బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. పొగమంచు కారణంగా డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అపూర్వ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఈ ఘటన తర్వాత జనవరి 29వ తేదీన ఆ కారును మహీంద్రా సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి అందులో ఉన్న లోపాలను వారికి వివరించాడు. తన కుమారుడు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పటికీ ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్ కాలేదని.. అసలు ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్‌ లేవని ఆరోపించాడు. కంపెనీ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మరణించాడంటూ వారిపై మండిపడ్డారు. ఈ మేరకు కంపెనీ తప్పుడు హామీలిచ్చి తనను మోసం చేసిందంటూ ఆనంద్‌ మహీంద్రా సహా ఆ సంస్థలో పనిచేస్తున్న మరో 12 మంది ఉద్యోగులపై రాజేశ్‌ మిశ్రా చీటింగ్ కేసు పెట్టాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news