ఆసియా గేమ్స్​లో రెచ్చిపోతున్న భారత్ షూటర్లు.. మరో రెండు గోల్డ్​మెడల్స్ సొంతం

-

ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఇండియన్ షూటర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత షూటర్లు ఇవాళ కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. ఈరోజు జరిగిన పోటీల్లో భారత షూటర్లు రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు.

పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ మెడల్ గెలుపొందింది. మరోవైపు భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.

మరోవైపు అంతకుముందు జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్‌, దివ్య తడిగోల్ టీమ్ రజతం గెలుచుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు దక్కించుకున్నారు. ఒక్క షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news