అక్రమాలను ప్రశ్నించాలని లేదంటే అది ప్రమాదకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు టీడీపీ ఆధ్వర్యంలో మోత మోగిద్దాంకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు. ‘పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
అమరరాజా, నుంచి లులూ వరకు పరిశ్రమలు వెళ్లిపోయాయని, తెలంగాణకు పెట్టుబడిదారులు వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థిలులు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణకు, ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు వెళ్లిపోవడంపై ది ప్రింట్ పత్రిక ప్రచురించిన కథనాన్ని బ్రాహ్మణి తన పోస్టుకు జతచేశారు. మరో వైపు టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం ఆన్ లైన్ సోషల్ క్యాంపెయిన్ కు కూడా నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించాలన్నారు.