పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ పార్టీలను ప్రైవేట్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవ్వరూ నడుపుతున్నారో అందరికీ తెలుసు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మరో చేతిలో ఉందన్నారు. కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
తెలంగాణ రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని తెలిపారు ప్రధాని మోడీ. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవులు కుటుంబ సభ్యులకే ఉన్నాయి. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. అవసరాల కోసం మాత్రం కొంత మందిని పెడతారు. బీజేపీ మాత్రం సామన్యులకోసం ఆలోచిస్తుంది. రోజు రోజుకు బీజేపీకి ఆదరణ పెరుగుతుందని.. మోడీ ఇచ్చే గ్యారెంటీపైన ఎంత నమ్మకం ఉందో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రతీ హామీని మోడీ నెరవేరుస్తున్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీపై ఆదరణ పెరుగుతుందన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రకటించామని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఈ రాత్రి నిద్ర కూడా పట్టదన్నారు.