రక్తంతో మోడీకి లేఖ రాసిన కన్నడ నటుడు 

-

కావేరి జలాల విషయంలో కొద్ది నెలలుగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల తమిళనాడు వాటా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో.. కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ అంశంపై సినీ, రాజకీయ ప్రముఖులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ తరుణంలోనే కావేరీ జలాల విషయంలో న్యాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి రక్తంతో లేఖ రాశారు ప్రముఖ కన్నడ నటుడు ప్రేమ్ నెనపిరావి. ఆ లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి.. కర్ణాటకకు, కావెరీకి న్యాయం చేయండి. కావెరి మాది అని రాశారు. రక్తంతో రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ లేఖను చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఈ సమస్య పరిస్కారం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news