గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం సువర్ణ కల్యాణ్ మండపం వద్ద గాంధీ చిత్రపటానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మౌన దీక్షకు దిగారు. పవన్‌కు సంఘీభావంగా పలువురు జనసేన నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. రెండు గంటల పాటు పవన్ కల్యాణ్ మౌన దీక్ష సాగనుంది.
ఇక, గాంధీ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ మహాత్మునికి నివాళులర్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్దం చేయడంఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ, మహాత్ముడి బాటలోనే నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లాంటివారు నడిచారు. మనదేశ స్వతంత్ర పోరాటాన్నీ, గాంధీజీ జీవితాన్నీ వేర్వేరుగా చూడలేము. అహింసాయుత ప్రజా పోరుతో పరాయి పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేశారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్మున్ని సర్మించుకుంటూ మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను.