భారత్ లో ఒక్క నెలలోనే 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం

-

యూజర్లకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. భారత్ లో దాదాపు 74.2 లక్షల ఖాతాలను నిషేధించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను ఆధారంగా లక్షలాది ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. నూతన ఐటీ నిబంధనలను అనుసరించి కేవలం ఆగస్టు నెలలోనే 74.2 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వెల్లడించింది.

జులై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువ. ఆగస్టులో నిషేధం విధించిన మొత్తం అకౌంట్లలో 35 లక్షలకు పైగా ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ సంస్థ తెలిపింది. ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందుగానే నిషేధించినట్లు పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు నెలలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించగా.. అందులో 3.1 లక్షల అకౌంట్లను ముందస్తు చర్యల్లో భాగంగానే నిలిపివేసినట్లు తెలిపింది.

సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న ఎండ్‌ – టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్‌ సర్వీసులో తాము అగ్రగామిగా ఉన్నట్లు వాట్సాప్‌ సంస్థ తాజాగా పేర్కొంది. యూజర్లకు భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు.. వారికి భద్రతాపరంగా మెరుగైన సేవలు అందించేందుకు, ఫిర్యాదులను విశ్లేషించి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని అక్టోబరు నెల రిపోర్టులో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news