బాబ్రీ మసీదు కూల్చిన రోజు ఏం జరిగింది…? కూల్చడానికి అంత మంది వెళ్ళారా…?

-

బాబ్రీ మసీదు కూల్చివేత” ఇంకో రెండేళ్ళు ఆగితే ఈ ఘటన జరిగి మూడు దశాబ్దాలు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హైలెట్ అయిన ఈ ఘటనతో ఒక్కసారిగా దేశంలో హిందు ముస్లింల మధ్య ఒక యుద్ద వాతావరణం నెలకొంది. ఆ ఘటన అనంతరం జరిగిన అల్లర్లలో దాదాపు రెండు వేలకు మందిపైగా మరణించారు. అసలు ఆ మసీదుని ఎందుకు కూల్చారు…? అప్పుడు ఉన్న నేతలు ఎవరు…? ఆ రోజు ఏం జరిగింది…? ఒక్కసారి చూస్తే… ఆ భూమి మాది అంటే మాది అని హిందు ముస్లింలు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు.

దీనిని హిందుత్వ సంస్థలు తమ భుజానికి ఎత్తుకున్నాయి. 1992 డిసెంబర్ ఆరున హిందుత్వ సంస్థ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, అప్పుడే రాజకీయ పార్టీ గా బలపడుతున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. 1,50,000 మంది కరసేవకుల (స్వచ్ఛంద కార్యకర్తల) తో అయోధ్యలోని దగ్గర భారీ ప్రదర్శన నిర్వహించారు అనేది ఎక్కువగా వినపడుతున్న ఆరోపణ. ఆ రోజు వారందరూ కలిసి మసీదు పైకి ఎక్కి… పూర్తిగా ద్వంశం చేసారని ఆరోపిస్తూ ఉంటారు.

 

 

ఈ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించింది, బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్‌సింగ్, వినయ్ కటియార్, ఉమా భారతి తదితరులనేది ముస్లిం వర్గాల వాదన. అప్పుడున్న ఫోటోలు, సహా కొన్ని ఆధారాలను సాక్ష్యంగా చేసుకుని వీరిని దోషులు అంటూ ఉంటారు. బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో 16 మంది కరసేవకులు చనిపోయారని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత రాష్ట్రపతిగా ఉన్న శంకర్ దయాల్ శర్మ… ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news