బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టాలని చుస్తున్నారు: మైనంపల్లి

-

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో జోరు సాగిస్తున్నాయి. మరోవైపు పార్టీల్లో జంపింగ్​లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫుల్ ఫోకస్​ పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు కీలక నేతలు హస్తంలో చేరారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. అలా కాంగ్రెస్​లో చేరిన కీలక నేతల్లో ఒకరు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ప్రజలు సరైన బుద్ది చెప్తారని అన్నారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడూపాయల, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చి, పిట్లంబేస్ లో ఉన్న దర్గాను మైనంపల్లి సందర్శించారు. ఆయన కుమారుడు రోహిత్‌తో కలిసి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

మెదక్‌ జిల్లా ప్రజల ఆశీర్వాదంతో గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గుర్తు చేశారు. ప్రజాసేవ కోసమే తన జీవితాన్ని అంకింత చేశానన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని నియోజకవర్గాలే అభివృద్ధి చెందుతున్నాయన్న మైనంపల్లి….. మిగిలిన నియోజకవర్గాలు ఏం పాపం చేశాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news