అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ను నిర్మిస్తాం: ఇస్రో ఛైర్మన్‌

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. మరోవైపు ఆదిత్య ఎల్1 వంటి ప్రయోగంతో ప్రపంచం దృష్టి ఆకర్షిస్తోంది. ఇక అంతరిక్షంలో మరిన్ని ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్తులో అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేష్ స్టేషన్​ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు.

భవిష్యత్‌లో అనేక రకాల మిషన్లు చేపట్టబోతున్నామని.. స్పేస్‌ స్టేషన్‌, దీర్ఘకాలం ప్రయాణించగలిగే మానవ సహిత స్పేస్‌ఫ్లైట్‌ ఆ జాబితాలో ఉన్నాయని సోమనాథ్‌ తెలిపారు. ‘చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైన తర్వాత అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. స్పేస్‌ స్టేషన్‌ భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందో పరిశీలిస్తున్నామని’ వెల్లడించారు.

రోబోటిక్‌ ఆపరేషన్‌తో వ్యోమగాములను అంతరిక్షానికి పంపి, అక్కడ స్పేస్‌ స్టేషన్‌ నిర్మించాలని యోచిస్తున్నట్లు సోమనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మానవ సహిత ఫ్లైట్‌ సామర్థ్యం భారత్‌కు లేనందున ఆ పనిపై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గగన్‌యాన్‌తో ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news