ప్రపంచ రికార్డు సృష్టించిన సౌత్ ఆఫ్రికా… ఆస్ట్రేలియా రికార్డు బద్దలు!

-

ఈ రోజు వరల్డ్ కప్ లో భాగంగా మధ్యాహ్నం నుండి ఢిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక మరియు సౌత్ ఆఫ్రికాలు తలపడుతున్నాయి. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ చేసింది.. నిర్ణీత ఓవర్ లలో సౌత్ ఆఫ్రికా అయిదు వికెట్లు కోల్పోయి 428 పరుగులు చేసింది. ఈ స్కోర్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం. అంతకు ముందు 2015 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు ఆఫ్గనిస్తాన్ లాంటి జట్టు పైన 417 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కానీ ఇప్పుడు ఆ రికార్డు కాస్త సౌత్ ఆఫ్రికా తుఫాన్ ప్లేయర్ల ధాటికి తుడిచి పెట్టుకుని పోయింది. సౌత్ ఆఫ్రికా టీం లో మొత్తం ముగ్గురు ప్లేయర్లు సెంచరీ లు (డికాక్ – 100 , డస్సెన్ – 108 , మార్కురామ్ 106) నమోదు చేసి శ్రీలంక ముందు భారీ టార్గెట్ ను ఉంచడం జరిగింది.

మరి శ్రీలంక ముందు ఉచిన ఈ టార్గెట్ ను ఛేదిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే కనీసం గట్టి పోటీ ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news