కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు : పొంగులేటి

-

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచితే తీసుకోండని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను అమ్ముకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టు కాంగ్రెస్ పార్టీ ఉన్న వేయించిన రింగురోడ్డును 32 సంవత్సరాలకు కల్వకుంట్ల కుటుంబం అమ్ముకుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి . ఇందిరమ్మ రాజ్యం తేవడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

I Will Contest On This Ground As Per The Wishes Of People: Ponguleti |  INDToday

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ స్కీములను ప్రజల్లోకి అందరూ తీసుకువెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో యువత ఆత్మహత్యలను తట్టుకోలేక వారి ఆత్మ గౌరవం కోసం సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని కనివిని ఎరుగని భారీ మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news