తెలంగాణలో కాంగ్రెస్ “బస్సు యాత్ర” కు సిద్ధమైంది. ఈ మేరకు “బస్సు యాత్ర”పై కాంగ్రెస్ నాయకత్వం తుది రూపు ఇస్తోంది. అక్టోబర్ 15, 16 తేదీలలో “బస్సు యాత్ర” లో పాల్గొంటున్నారు ప్రియాంక గాంధీ. అక్టోబర్ 19, 20, 21 తేదీలలో “బస్సు యాత్ర” లో పాల్గొంటున్నారు రాహుల్ గాంధీ. “బస్సు యాత్ర” ముగింపు కార్యక్రమానికి సోనియా గాంధీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

అదిలాబాద్.. లేదంటే ఆలంపూర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. నిజామాబాద్ లేదంటే కరీంనగర్ జిల్లా బస్సు యాత్ర లో రాహుల్ పాల్గొంటారు. ఇక ఈ నెల 10 న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ “బస్సు యాత్ర” మరియు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు కాంగ్రెస్ పెద్దలు.