వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి అందరి మన్ననలు పొందారు. అయితే 85 రన్స్ వద్ద క్యాచ్ అవుట్ గా వెనుదిరిగిన కోహ్లీ… అనంతరం ఇచ్చిన రియాక్షన్ వైరల్ అవుతుంది. మ్యాచ్ ను ముగించే సమయంలో అవుట్ అయ్యానే అనుకుంటూ తన తలను కొట్టుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ బాధపడాల్సిన అవసరం లేదని…. కెరీర్ లో మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడావంటూ కోహ్లీని ప్రశంసిస్తున్నారు.
![Virat Kohli not happy with himself in the dressing room after getting out](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/10/Virat-Kohli-not-happy-with-himself-in-the-dressing-room-after-getting-out.jpg)
కాగా, ఆసీస్ తో మ్యాచ్లో కేఎల్ రాహుల్(97) సెంచరీ కాకుండా హార్దిక్ అడ్డుకున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 39వ ఓవర్లో సిక్స్ కొట్టిన పాండ్యా ఆ సమయంలో రాహుల్ కు స్ట్రైకింగ్ ఇచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకునేవారని విమర్శిస్తున్నారు. గతంలో WIతో సిరీస్ లో తిలక్ వర్మను(49) కూడా హాఫ్ సెంచరీ చేయకుండా పాండ్యా ఇలానే చేశారని అంటున్నారు. అయితే నెట్ రన్ రేటు కోసమే హార్దిక్ అలా చేశారని అతని ఫాన్స్ చెబుతున్నారు.