టైగర్ నాగేశ్వరరావు సినిమాలో తన పాత్ర కీలక వ్యాఖ్యలు చేసిన రేణుదేశాయ్‌

-

రేణూ దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో… 70వ దశకంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ సంఘసంస్కర్తగా పేరుగాంచిన హేమలతా లవణం పాత్రను పోషించారు. ఇటీవల హేమలతా లవణంగా రేణూ దేశాయ్ లుక్ ను చిత్రబృందం విడుదల చేయగా, విశేషమైన స్పందన వచ్చింది. దీనిపై రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. “నన్ను నమ్మి ఈ చిత్రంలో హేమలతా లవణం గారి క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత అభిషేక్ అగర్వాల్ భయ్యాకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు” అని పేర్కొన్నారు.

Renu Desai Interview - Colaboratory

ఇది ఇలా ఉంటె, టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ కొత్త అవతారం ఎత్తాడు. ఇన్నాళ్లు డ్యాన్సులు, ఫైట్లు, యాక్టింగ్తో అభిమానులను అలరించిన రవితేజ.. నిన్న జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లో సందడి చేశాడు. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో రవితేజ ప్రత్యక్షమై ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. వ‌న్డే వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా ఫస్ట్స మ్యాచ్ ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. అయితే ఈ మ్యాచ్కు రవితేజ కామెంటేటర్గా అవతారం ఎత్తాడు. భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రవితేజ కామెంట్రీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news