న‌వంబ‌ర్ 9 నామినేష‌న్లు వేయనున్న సీఎం కేసీఆర్‌

-

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే అభ్యర్థులకు బీఫారాలను అధినేత కేసీఆర్ అందచేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇస్తారు. కాగా.. అదే సందర్భంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. అనంతరం అదేరోజు (అక్టోబర్ 15) న హైద్రాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు పాల్గొనే విషయం తెలిసిందే.

Telangana CM KCR rules out early polls

ఇది ఇలా ఉంటె, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. న‌వంబ‌ర్ 9వ తేదీన నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌నున్నారు. గ‌జ్వేల్, కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి కేసీఆర్ నామినేష‌న్లు స‌మ‌ర్పించ‌నున్నారు. నామినేష‌న్ల దాఖ‌లు కార్య‌క్ర‌మంలో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సీఎం కేసీఆర్. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేశారు. అనంతరం మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news