ఉదయం నుండి ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్లు కోల్పోయి 364 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంత స్కోర్ సాధించడంలో కీలక పాత్ర వహించిన వారిలో ఓపెనర్లు మలన్ (140), బెయిర్ స్టో (52) లు చక్కని పునాదిని వేశారు. ఆ తర్వాత రూట్ (82) తన చక్కని ఫామ్ ను కొనసాగించి వరుసగా రెండవ అర్ద సెంచరీ ను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఎవ్వరూ రాణించకపోవడంతో ఇంగ్లాండ్ 400 లోపు పరిమితం అయింది. ఇక బంగ్లా బౌలర్లలో మహేది హాసన్ 4 వికెట్లు, షోరిఫుల్ ఇస్లాం మూడు వికెట్లు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ ముందు 365 పరుగుల భారీ టార్గెట్ ఉంది..
మరి ఈ స్కోర్ ను ఛేదించడం అంత తేలికా? ఇంగ్లాండ్ లాంటి నెంబర్ వన్ బౌలింగ్ లైన్ అప్ ఉన్న బౌలర్లను అడ్డుకుని మ్యాచ్ లో గెలుస్తుందా లేదా అసలు ఇంగ్లాండ్ కు మొదటి విజయం దక్కుతుందా లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికాసేపు ఆగాల్సిందే.