మోడీ రాజ్యం రావాలా..? ఎంఐఎం రాజ్యం రావాలా ? : బండి సంజయ్

-

తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఎంఐఎం రాజ్యం రావాలా అని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే మోడీ రాజ్యం.. మోడీ రాజ్యం కావాలా..? ఎంఐఎం రాజ్యం కావాలా అని ప్రశ్నించారు బండి సంజయ్. ఆదిలాబాద్ లో జరిగిన జనగర్జన సభలో మాట్లాడారు బండి సంజయ్. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క గ్రూపు 1 నోటిఫికేషన్ వేయలేదు.  యువతకు ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒరిగింది ఏమి లేదన్నారు. ఇంకా మిగిలింది 50 రోజులు మాత్రమే.. ఈ 50 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు.  నవంబర్ 30న జరిగే  తెలంగాణ ఎన్నికల్లో   బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలన్నారు. మోడీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా జాతీయ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ, కృష్ణా వాటర్ బోర్డును ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news