ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

-

ఈరోజుల్లో ఇంట్లో ఉండే ఎలాంటి డాక్యుమెంట్స్‌ కావాలన్నా అప్లై చేసుకుంటున్నాం. ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు లాంటి ముఖ్యమైన అన్నీ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చాలామంది ఐడియా లేదు. ఈరోజు మనం క్లియర్‌గా ఎలా ఆన్‌లైన్లో డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అప్లై చేసుకోవాలో చూద్దాం.!

రోడ్డు మీద బండి తీస్తున్నామంటే.. మనకు డ్రైవింగ్‌ మాత్రమే వస్తే సరిపోదు.. లైసెన్స్‌ కూడా ఉండాలి. వాహనం నడపాలంటే చట్టపరంగా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందే. ఇది చాలా సమయం పడుతుంది. అయితే, మీరు మీ సౌలభ్యం మేరకు ఆన్‌లైన్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలా అంటే..

మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పటికీ, మీ లైసెన్స్ పొందడానికి మీరు సమీపంలోని RTO కార్యాలయానికి వెళ్లవలసి ఉంటుంది. అలాగే, కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ట్రాఫిక్ నిబంధనల గురించి తెలుసుకోవాలి. మీరు మీ వయస్సు మరియు ఇతర అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి.

మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ https://parivahan.gov.in/parivahan/కి వెళ్లండి.
ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలపై క్లిక్ చేయండి.
అప్పుడు మీరు నివసిస్తున్న రాష్ట్రాన్ని ఎంచుకోండి.
‘లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్’ ఎంపికను ఎంచుకోవాలి.
ఇక్కడ జాబితా చేయబడిన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవండి. మీ వ్యక్తిగత వివరాలను పూరించండి.
మీ మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
లెర్నింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
చివరగా పరీక్ష తేదీని ఎంచుకుని, చెల్లింపు చేయండి.

అంతే స్లాట్‌ను బట్టి మీకు టైమ్‌, డేట్‌ వస్తుంది. అప్పుడు దగ్గర్లోని ఆర్టీవో ఆఫీస్‌కు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, రూల్స్‌పై అవగాహన ఉండాలి. అప్పుడే పరీక్షలో పాస్‌ అవుతారు. అప్పుడే లైసెన్స్‌ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news