కారును పోలిన గుర్తులు తొలగించాలని సుప్రీంను ఆశ్రయించనున్న బీఆర్ఎస్..!

-

కారును పోలిన గుర్తులను తొలగించాలని  ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను  బీఆర్ఎస్ వెనక్కి తీసుకుంది.ఇదే విషయమై  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది.బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు  కారును పోలిన గుర్తులను  స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ  సుప్రీంకోర్టులో  పిటిషన్ ను దాఖలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఇదే విషయమై  ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే  ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్ ను బీఆర్ఎస్ వెనక్కు తీసుకుంది.  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే కారణంగా  ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకుంది. 

రోడ్డు రోలర్,  టెలివిజన్, కుట్టు మిషన్, చపాతీ రోలర్,  కెమెరా, సోప్ డిష్, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించవద్దని  ఈసీని  బీఆర్ఎస్ కోరింది.  ఈ విషయమై గతంలో కూడ  ఈసీకి బీఆర్ఎస్ వినతిపత్రం సమర్పించింది. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలో పర్యటనకు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో వచ్చిన  ఈసీ బృందానికి బీఆర్ఎస్  వినతి పత్రం సమర్పించింది. గతంలో  బీఆర్ఎస్  వినతి పత్రం సమర్పించిన సమయంలో  రోడ్డు రోలర్,  ఆటోరిక్షా వంటి గుర్తులను తొలగించారని  బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ ఆ తర్వాత ఈ గుర్తులను  ఇండిపెండెంట్లకు కేటాయిస్తున్నారు. కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించడంతో  తమ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ వాదిస్తుంది. కారు గుర్తును  పోలిన జాబితాను  ఈసీకి  బీఆర్ఎస్ అందించింది.గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో కారును పోలిన గుర్తులతో  తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని  బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news