అమిత్ షాతో నారా లోకేష్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్..!

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్.. అమిత్ షాని కలిసింది బీజేపీలో విలీనం కాడానికేగా? అని లోకేష్‌ని ట్విట్టర్‌లో ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. దీనికి నెటిజన్లు అంబటికి తమదైన శైలిలో కౌంటర్స్ వేస్తున్నారు.

 దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కీలక నేత నారా లోకేష్ బుధవారం కలిసిన విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై  కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు, విచారణ పేరుతో తనను వేధిస్తున్నట్లు కేంద్రమంత్రికి వివరించారు.  చివరకు తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీపై ఎన్ని కేసులు పెట్టారు? అని అమిత్ షా.. లోకేష్‌ని కూడా అడిగి తెలసుకున్నారట.  

అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. జగన్  దెబ్బకు చంద్రబాబు  రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారన్నారు. భయమంటే  జగన్ కు చూపిస్తానని లోకేష్  కూడ వ్యాఖ్యలు చేశారని  మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని  లోకేష్ కు మంత్రి అంబటి రాంబాబు సూచించారు. 17ఏ సెక్షన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని  మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.కానీ, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అవినీతి జరగలేదని  మాత్రం టీడీపీ నేతలు చెప్పడం లేదన్నారు.  పచ్చగా ఉన్న టీడీపీ సర్వనాశనం కావడానికి లోకేష్ కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యేగా కూడ విజయం సాధించని లోకేష్ ను   మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. లోకేష్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే  టీడీపీకి ఈ  పరిస్థితి నెలకొందని ఆయన  విమర్శలు చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news