తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తున్నారని ఐటీ దాడుల్లో రూ. 42 కోట్లు దొరికినట్లు వస్తున్న వార్తలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఓట్ల కొనుగోలు కోసం వందల కోట్ల రూపాయలను పంపిస్తోంది. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన PCC CHEAP ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాడు. కాబట్టి ఇది ముందే ఊహించాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అటు హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో 42 కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఐటి అధికారులు. తెలంగాణలోని ఓ ప్రముఖ వ్యక్తి డబ్బులుగా అధికారులు గుర్తించనట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని హరీష్ రావు కూడా వెల్లడించారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయన్నారు. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివేనని ఆరోపించారు మంత్రి హరీష్ రావు.