ముఖం మనిషిలా.. పాదాలు నిప్పుకోడిలా..? ఎందుకిలా..?

-

కొన్నిసార్లు రెండు తలలతో పుట్టడం, లేదా కవలలు తలలు ఒకదానికి ఒకటి అతుక్కుపోవడం మీరు వినే ఉంటారు. కొందరికి కాళ్లకు ఆరువేళ్లు ఉంటాయి. ఇవి చాలా సాధారణంగా జరిగేవి. కానీ రూపం మొత్తం మనిషిలానే ఉంటుంది. జనరల్‌గా గిరిజన తండాల్లో ఉండే మనుషుల రంగు, వారి వస్త్రాలంకరణ కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ.. భౌతిక నిర్మాణం మాత్రం ఒకేలా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ విచిత్రమైన కాలు ఉంటుంది. ఆ తెగలన్నింటిలోనూ ఈ వ్యత్యాసాన్ని మీరు చూడవచ్చు. అక్కడి ప్రజలకు కాళ్లు నిప్పుకోడిలా ఉంటాయి. ఇది ఏ జాతి, ఎక్కడ ఉంది, వాళ్లకు అలా ఎందుకు అవుతుంది..?

వడోమా తెగ ప్రజలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి వారి పాదాలకు, చేతులకు ఐదు వేళ్లు ఉంటాయి. అయితే ఉత్తర జింబాబ్వేలోని కయెంబా ప్రాంతంలో నివసించే వాడోమా తెగకు కేవలం రెండు వేళ్లు మాత్రమే ఉన్నాయి. వీళ్ల రెండు వేళ్లు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూసేవారు ఆశ్చర్యపోతున్నారు. గిరిజనుల శరీరమంతా మనిషిలా ఉంటుంది. కానీ పాదాల డిజైన్ నిప్పుకోడిలా ఉంటుంది. వారి కాలి చాలా పెద్దదిగా ఉన్నందున వారు బూట్లు ధరించలేరు. మామూలు మనుషుల్లా కూడా నడవరు.

వారి కాలి వేళ్లు ఇలా కనిపించడానికి కారణం ఏమిటి? :

వడోమా తెగకు చెందిన వారికి జన్యుపరమైన రుగ్మత ఉంటుంది. దీనిని అక్రోడాక్టిలీ లేదా ఆస్ట్రిచ్ ఫుట్ సిండ్రోమ్ అంటారు. ఇది అరుదైన వ్యాధి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అక్రోడాక్టిలీని స్ప్లిట్ హ్యాండ్/ఫుట్ మాల్‌ఫార్మేషన్ (SHFM) అని కూడా అంటారు. ఈ వ్యాధి కాలి వేళ్లను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి వేళ్లతో పాటు పాదాల్లోనూ మార్పు కనిపిస్తుంది.

వడోమా తెగ ప్రజలు సరిగ్గా నడవడం కష్టం. వారు బూట్లు ధరించడం కష్టం. కానీ చెట్టు ఎక్కడం వారికి చాలా సులభం. చాలా వేగంగా ఏక్కేస్తారు. ఈ వ్యాధి వడోమా తెగలో వారసత్వంగా వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి తరం నుండి తరానికి కొనసాగుతుంది. తండ్రి, తల్లి, పిల్లలు, మనవరాళ్లు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు తమ తెగకు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే నియమం ఉంది. వారు వేరే తెగ లేదా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం క్షమించరాని నేరం.

Read more RELATED
Recommended to you

Latest news