WORLD CUP 2023: ఇద్దరిదీ “ఒకే కథ”… విజయమే వారిని గట్టెక్కించాలి !

-

వరల్డ్ కప్ లో ఈ రోజు శ్రీలంక మరియు ఆస్ట్రేలియాల మధ్యన లక్నో లో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ ఖచ్చితంగా ఆస్ట్రేలియా అయినప్పటికీ శ్రీలంకను తక్కువ చేయడానికి వీలు లేదు. బౌలింగ్ లో మాత్రమే బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంక బ్యాటింగ్ లో దుర్బేధ్యంగా ఆడుతోంది. తాము ఆడిన రెండు మ్యాచ్ లలోనూ 300 కు పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా తాము ఆడిన రెండు మ్యాచ్ లలో కనీసం 200 పరుగులకు చేరుకోలేకపోయింది. బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం ఎవ్వరూ నిలబడి పరుగులు చేయలేక సతమతం అవుతున్నారు. ఇప్పడు శ్రీలంక ఆస్ట్రేలియాలు ఇద్దరూ కూడా రెండు మ్యాచ్ లు ఆడి రెండూ ఓటమి పాలయ్యారు. కాబట్టి రెండు జట్లకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం..

ఒక్కో మ్యాచ్ ఓడిపోయే కొద్దీ సెమీస్ కు చేరే అవకాశాలు సన్నగిల్లుతుంటాయి. మరి ఏ జట్టు ఈ రోజు గెలిచి సెమీస్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకుంటుందో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news