తగ్గేదేలే… రాష్ట్రపతి నుండి జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ !

-

తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరికీ దక్కని అరుదైన గౌరవం బన్నీ అని అందరూ ముగ్గురుగా పిలుచుకునే అల్లు అర్జున్ కు దక్కింది. గతంలో డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలోని నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వరించింది. ఈ రోజు ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాను నటన కోసం ఎంతకైనా తెగించే నటుడు అని గర్వంగా తెలుగు ప్రజలు తెలెత్తుకుని చెప్పగలిగే స్థాయికి వెళ్ళాడు. కాగా ఈ అవార్డును అందుకోవడానికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. మరో జాతీయ అవార్డు సిద్ధంగా ఉంచుకోండి అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇక ఉత్తమ నటిగా గంగాబాయి కతీయవాడి సినిమాలో నటనకు గాను ఆలియా భట్ కు, మరియు మిమి సినిమాలో నటనకు గాను కృతి సనన్ కు జాతీయ అవార్డులు దక్కాయి.

Read more RELATED
Recommended to you

Latest news