నెట్​ఫ్లిక్స్​లో లియో మూవీ స్ట్రీమింగ్.. .. అంత త్వరగానా?

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. విజయ్ ఫ్యాన్స్ థియేటర్లలో నానా హంగామా చేస్తున్నారు. అయితే ఈ సినిమా మిక్స్​డ్ టాక్​ను సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా విజయ్​కు అంతగా కమర్షియల్ సక్సెస్ సినిమాలు లేవు. ఇప్పుుడ ఈ చిత్రం కూడా మిక్స్​డ్ టాక్​ను సొంతం చేసుకోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే మొదటి రోజు కాబట్టి ఇలా ఉందని.. రానురాను మౌత్​ టాక్​తో హిట్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ నెట్​ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం సదరు సంస్థ​ రికార్డ్​ స్థాయి మొత్తాన్ని ముట్టజెప్పినట్లు కోలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్​తో అగ్రీమెంట్​ కుదిరిందట. అంటే అక్టోబర్ 19న థియేటర్లలోకి ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి.. నవంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news