చంద్రబాబు ఏ రత్నమో చెప్పాలని ఫైర్ అయ్యారు వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి. ‘చంద్రబాబుగారు జాతిరత్నం, దేశరత్నం’ ఆయనను కాపాడుకోవాలంటూ పచ్చతమ్ముళ్లు నినాదాలిస్తారు. ఏ “జాతి”రత్నమో, ఏ “దేశ”రత్నమో, ఏ “ఖండ”రత్నమో ఏ “గ్రహ”రత్నమో ఎవరికీ చెప్పరు! కనీసం తెలుగు”దేశ” రత్నమని కూడా చెప్పుకోలేని దుస్థితి అంటూ చంద్రబాబు పై సెటర్లు పేల్చారు సాయి రెడ్డి.
‘చంద్రబాబు ప్రజల ఆస్తి. ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదే’ అంటూ మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు గారేమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారు. దొరికినంత దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఆయనేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు. గొప్ప క్రీడాకారుడు కాడు. ఆధారాలతో సహా దొరికి జైలుపాలైన నిందితుడు మరియు వెన్నుపోటుదారుడు అంటూ మండిపడ్డారు. సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుందన్నారు సాయి రెడ్డి.