వరల్డ్ కప్ 2023: ముగిసిన పాకిస్తాన్ ఇన్నింగ్స్… ఆఫ్ఘన్ ముందు భారీ లక్ష్యం!

-

వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కాసేపటి క్రితమే ఇన్నింగ్స్ ముగిసింది. పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాకిస్తాన్ ప్లేయర్స్ లో బాబర్ 74, షఫీక్ 58, షాదాబ్ ఖాన్ 40, ఇఫ్తికార్ అహమద్ 40 లు రాణించారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో ఈ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న స్పిన్నర్ నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, చివరి ఓవర్లో నవీన్ ఉల్ హాక్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మాములుగా పాకిస్తాన్ ఇన్నింగ్స్ సాగిన తీరు చూస్తే ఈ స్కోర్ రావడం అంటే గొప్ప విషయమే అని చెప్పాలి.. ఓవర్లకు 200 పరుగులు చేసిన పాకిస్తాన్ ఆ తర్వాత ఆఖరి 10 ఓవర్ లలో షాదాబ్ మరియు ఇఫ్తికార్ లు బ్యాట్ జులిపించడంతో 282 పరుగులు చేయగలిగింది.

ఈ స్కోర్ ను ఛేదించడం అంత సులభం కాదు.. ఓపెనర్లు ఏమైనా రాణిస్తే అవకాశాలు ఉంటాయి. రహ్మనుల్లా గుర్భాజ్ చెలరేగితే ఈ స్కోర్ ను ఉఫ్ మని ఊదేస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news