ఘనంగా వెంకటేశ్‌ రెండో కుమార్తె ఎంగేజ్​మెంట్.. హాజరైన సినీ ప్రముఖులు

-

టాలీవుడ్‌ సీనియర్ హీరో వెంకటేశ్‌ సెకండ్ ఇన్నింగ్స్​లో దూసుకెళ్తున్నాడు. ఓవైపు ఎఫ్2 లాంటి కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు సైంధవ్ లాంటి సీరియస్ సినిమాలకు జై కొడుతున్నాడు. ఇంకోవైపు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్​తో డిజిటల్ వరల్డ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వెంకీ పర్సనల్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఓ సీనియర్ హీరో కూతురి పెళ్లి వేడుక అంటే ఎంత ధూంధాంగా జరుగుతుంది.. ఎంత హడావుడిగా జరుగుతుందో తెలిసిందే. కానీ వెంకీ మాత్రం ఈ థాంజాంకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు.

తాజాగా వెంకటేశ్ రెండో కుమార్తె హయ వాహిని ఎంగేజ్మెంట్​ ఎలాంటి చడీచప్పుడు లేకుండా బుధవారం రోజున వైభవంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వెంకటేశ్ తన నివాసంలోనే ఈ వేడుక నిర్వహించాడు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news