WORLD CUP 2023: పూర్తిగా తేలిపోయిన ఛాంపియన్ టీమ్… స్వల్ప స్కోర్ కే ఆల్ ఔట్!

-

ఈ రోజు బెంగుళూరు వేదికగా జరుగుతున్న చావో రేవో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ టీం అంచనాలను అందుకోలేక శ్రీలంక బౌలర్ల దెబ్బకు స్వల్ప స్కోర్ కె ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఓఎంర్లు ఇన్నింగ్స్ ను బలంగానే ఆరంభించిన మాత్యుస్ వేసిన ఒక అద్భుతమైన బంతికి డేవిడ్ మలన్ అవుట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి ఇంగ్లాండ్ ఎక్కడా కోలుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 157 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు మరోసారి దారుణంగా విఫలం అయ్యి వరల్డ్ కప్ లో మరో దారుణమైన పరాజయానికి కారణం అయ్యారు. స్టోక్స్ 43, బెయిర్ స్టో 30, మలన్ 28 లు మాత్రమే ఆ మాత్రం స్కోర్ అయినా చేశారు. మిగిలిన వారంతా శ్రీలంక పేస్ కు తాళలేక వికెట్లు సమర్పించుకున్నారు.

శ్రీలంక బౌలర్లలో కుమారా 3, రజిత మరియు మాత్యుస్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. కమ్ బ్యాక్ మ్యాచ్ లో మత్యుస్ అదరగొట్టి ఇంగ్లాండ్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యాడు. మరి శ్రీలంక ముందుంచిన 157 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news