నవంబర్ నెలాఖరులోగా ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు DME డా. నరసింహం. ప్రభుత్వ బోధనాస్పత్రులు, వైద్య కళాశాలలో పారామెడికల్, నాన్-క్లినికల్ సహాయ సిబ్బంది పోస్టులన్నీ నవంబర్ నెలఖరులోగా భర్తీ చేయాలని DME డా. నరసింహం ఉత్తర్వులు జారీచేశారు.
పోస్టుల భర్తీకి DSC ద్వారా కంబైన్డ్ నోటిఫికేషన్ ఇవ్వాలని సూపరిండెంట్లు, ప్రిన్సిపాల్స్ కు సూచించారు. కొత్త కాలేజీలోని పోస్టులతో పాటు పాత బోధనాస్పత్రులు, కాలేజీల్లో ఉన్న 1800 ఖాళీలను DSC ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే, ఏపీలోని పశువుల ఆరోగ్యం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశువుల ఆరోగ్య భద్రత కోసం జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష తరహాలోనే దీనిని అమలు చేయనుంది. వచ్చేనెల 7న తిరుపతి జిల్లాలో, 10న ఎన్టీఆర్ జిల్లాలో, 14న విజయనగరం జిల్లాలో ప్రయోగాత్మకంగా శిబిరాలను ఏర్పాటు చేయనుండగా… డిసెంబర్ 1-31 వరకు రాష్ట్రమంతటా శిబిరాలు నిర్వహించనుంది.