వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా స్క్వాడ్ లో చోటు దక్కించుకున్న గాయం కారణంగా మొదటి అయిదు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ రోజు న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ తో తొలి సారి ఆడుతున్న ట్రావిస్ హెడ్ అదరగొట్టాడు. ఏ మాత్రం ఒత్తిడి లేకుండా చాలా స్వేచగా బ్యాట్ ను జులిపించాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్ కేవలం 25 బంతుల్లోనే అర్ద సెంచరీ మరియు 59 బంతుల్లోనే సెంచరీ సాధించి వరల్డ్ రికార్డు ను నెలకొల్పాడు. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఓపెనర్ గా రోహిత్ శర్మ పేరిట ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఈ రికార్డు కాస్త ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతను ఇన్నింగ్స్ లో 67 బంతులు ఆడగా 10 ఫోర్లు మరియు 7 సిక్సులు సహాయంతో 109 పరుగులు చేసి స్పిన్నర్ ఫిలిప్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఓపెనర్లు అవుట్ అయ్యాక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ పూర్తిగా గాడి తప్పింది అని చెప్పాలి.
వరుసగా వికెట్లు కోల్పోతూ ట్రాక్ మారిపోయింది, ప్రస్తుతం క్రేజులో మాక్స్ వెల్ మరియు జాన్ ఇంగ్లీష్ లు ఆడుతున్నారు. వీరిద్దరూ మిగిలిన ఓవర్లు ఆడితే ఖచ్చితంగా ఆస్ట్రేలియా 350 కుపైగా పరుగులు పూర్తి చేసుకుంటుంది.