బిగ్‌బాస్‌-7 నుంచి సందీప్ మాస్టర్ ఎలిమినేట్‌

-

బిగ్‌బాస్‌ సీజన్‌-7 రోజురోజుకు ఇంట్రెస్టింగ్​గా మారుతోంది. ఈ సీజన్ షురూ అయినప్పటి నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కానీ ఈ ఆదివారం మాత్రం మొట్టమొదటి సారిగా ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. అది కూడా హౌస్​తో పాటు ప్రేక్షకులు కూడా చాలా స్ట్రాంగ్ అనుకుంటున్న సందీప్ మాస్టర్. ఈ వారం నామినేషన్స్‌లో శోభాశెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌ ఉన్నారు. వీరిలో చివరకు సందీప్‌, శోభాశెట్టి మిగిలగా.. సందీప్ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున చెప్పాడు. సందీప్‌ ఎలిమినేషన్‌తో తేజ, శోభ, ప్రియాంక ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

సందీప్‌ నువ్వు వెళ్లే ముందు ఇంటిలోని ప్రతి ఒక్కరి గురించి నీ ఫస్ట్‌ ఇంప్రెషన్‌, లాస్ట్‌ ఇంప్రెషన్‌ చెప్పమని నాగార్జున కోరగా సందీప్ వారి గురించి ఇలా చెప్పాడు.

శోభాశెట్టి: చాలా సాఫ్ట్‌, చాలా స్ట్రాంగ్‌ ప్లేయర్‌. ఒక్కొసారి చిన్న పిల్లలా అనిపిస్తుంది అని.. అర్జున్‌: డార్లింగ్‌. కొంచె బ్యాలెన్స్‌గా ఉన్నాడు అని.. అమర్‌దీప్‌: బెస్ట్‌ పర్సన్‌. మై బెస్ట్‌ ఫ్రెండ్‌ అని.. యావర్‌: చాలా సెన్సిటివ్‌. లవ్లీ బ్రదర్‌. చాలా స్ట్రాంగ్‌ ప్లేయర్‌ అని.. శివాజీ: అన్న బంగారం. హార్ట్‌ఫుల్‌ పర్సన్‌ అని.. ప్రియాంక: ఆల్‌టైమ్‌ ఫెవరెట్‌ అని చెప్పుకొచ్చాడు.

ఇక రతిక: చాలా షార్ప్‌ అనుకున్నా.. కొంచెం అమాయకురాలు అని సందీప్ అన్నాడు. గౌతమ్‌: ఇంటలెక్చువల్‌, అశ్విని: ఈ అమ్మాయి అసలు ఆడుతుంది అనుకోలేదు. గత రెండు వారాల ఆట చూసి నేను షాక్‌ అయ్యానని చెప్పాడు. భోలే షావలి: చాలా బాగా మాట్లాడతారు. నేను మీలాగా ఎవ్వరినీ చూడలేదు అని.. ప్రశాంత్‌: చాలా చాలా షార్ప్‌, తేజ: హౌస్‌లో అందరికన్నా తెలివైనవాడని సందీప్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news