ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించిన హరీష్ రావు !

-

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి రాజు అనే వ్యక్తి సూరంపల్లి ప్రచారంలో ఉండగా కత్తితో దాడి చేసిన విషయంపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. హరీష్ రావు మాట్లాడుతూ ఈ హత్యాయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ స్టార్ట్ చేశారు, ప్రభాకర్ రెడ్డి పై ఇలా జరగడం అత్యంత బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనము అంతా ఉంటున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో హింసకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తావు లేదంటూ హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ మరియు ప్రభుత్వం దీనిని ఖండిస్తున్నాం అంటూ తెలిపారు. ప్రథమ చికిత్సను పూర్తి చేసుకున్న అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ కు పంపించాము అంటూ హరీష్ రావు తెలియచేశారు. కట్టి తో దాడి చేయడం వలన ఆయనకు కడుపులో గాయాలు అయినట్లు హరీష్ రావు తెలియచేశారు.

ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు, ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అంటూ భరోసాను అందించారు హరీష్ రావు. కాగా ఈ హత్యాయత్నం లో ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఉందన్న విషయంపై కూడా దర్యప్తు చేస్తున్నారు అంటూ ముగించారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news