గత రెండు సంవత్సరాల క్రితం కరోనా అనే మహామ్మారీ మన జీవితాలలోకి ప్రవేశించి మానవాళిని అతలాకుతలం చేసింది. లక్షల సంఖ్యలో మరణించగా , కోట్ల సంఖ్యలో మరణపు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ గతంలో కరోనా బారినపడి కోలుకున్న వారిని ఉద్దేశించి కీలకమైన సూచనలు చేశారు. ఎవరైతే కరోనా ను ఎదుర్కొని ప్రాణాలతో బయట పడ్డారో వారు 1 నుండి 2 సంవత్సరాలు ఒత్తిడితో కూడిన ఎటువంటి పనులు చేయడానికి వీలు లేదంటూ ఖరాఖండీగా చెప్పేశాడు మంత్రి మాండవీయ. రీసెంట్ గా మీరు చూసుకుంటే దేశంలో గుండెపోటు మరణాలు అధికంగా కనిపిస్తున్నాయి, వీటిపైన ICMR చేసిన ఒక అధ్యయనంలోని విషయాలను మాండవీయ ప్రజలకు తెలిపే ప్రయత్నం చేశారు.
కరోనా బాధితులు గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే రెండు సంవత్సరాలు ఎటువంటి ఒత్తిడికి లోనయ్యే పనులు మరియు వ్యాయామాలు చేయవద్దని సూచించింది. ముఖ్యంగా యువతీ యువకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.