యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ భామ లుక్ కూడా రిలీజ్ అయింది. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాలో జాన్వీ పాత్రను పరిచయం చేస్తూ నెట్టింట్లో ఓ పోస్టర్ వదిలింది. ఆ పోస్టర్లో జాన్వీ అచ్చమైన పల్లెటూరు ఆడపడుచులా అందంగా కనిపిస్తోంది. మరోవైపు లంగా వోణీలో నడుం వొయ్యారాలు వొలకబోస్తూ మెస్మరైజ్ చేస్తూ సందడి చేసింది. ఈ సినిమాలో జాన్వీ పాత్రపేరు తంగం అని టీమ్ తెలిపింది. ఈ పోస్టర్లో జాన్వీని చూసిన నెటిజన్లు శ్రీదేవిని చూసినట్లే ఉందని కామెంట్లు పెడుతున్నారు.
‘ఇదిగో మా తంగం’ అంటూ చిత్రబృందం క్యాప్షన్ పోస్టు చేసింది. ‘దేవర’ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్ కోసం రీసెంట్‌గానే గోవా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భైరా అనే పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలసిందే.
The gorgeous #JanhviKapoor as #Thangam from the sets of #Devara ❤️#DevaraPart1 releasing on April 5th, 2024 ❤🔥@tarak9999 #KoratalaSiva #SaifAliKhan @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sabucyril @sreekar_prasad @YuvasudhaArts @DevaraMovie pic.twitter.com/smh7rC5WE1
— NTR Arts (@NTRArtsOfficial) October 31, 2023