ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కూడా గెలిచే సత్తా ఉంది : జంగా రాఘవరెడ్డి

-

కాంగ్రెస్ బీఫాం ఇవ్వ‌కుంటే వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏఐఎఫ్‌బీ నుంచి పోటీ చేస్తాన‌ని డీసీసీబీ మాజీ చైర్మ‌న్ కాంగ్రెస్ అస‌మ్మ‌తి నేత‌ జంగా రాఘ‌వ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని, తనకు టిక్కెట్ ఇవ్వకుంటే అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కూడా గెలిచే సత్తా తనకు ఉందన్నారు. తాను మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం దారుణమన్నారు.

పార్టీ టికెట్ వచ్చిన అభ్యర్థి… బీజేపీ తొత్తు అని ఆరోపించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఆదుకున్న వారికే టికెట్ ఇస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారని, కానీ పార్టీని, ప్రజలను మోసం చేసే వారికి టిక్కెట్ ఇస్తే గెలవరన్నారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా తనకు టిక్కెట్ ఇవ్వడంపై పునరాలోచన చేయాలన్నారు. లేదంటే తాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news