రేపటి నుంచే నామిషన్ల ప్రక్రియ షురూ.. ఈసీ సూచించిన నిబంధనలు ఇవే

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో నామినేషన్‌ సమయంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

 

ఈ నిబంధనలు తప్పనిసరి…

  • నామినేషన్‌ వేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారైతే సదరు అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే పక్షంలో అదే నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
  • ఓటు హకు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే ఓటు హకు ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
  • ఒకో అభ్యర్థి ఒకో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయొచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
  • అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలి.
  • నామినేషన్‌ సమయంలో రిటర్నింగ్‌ అధికారి అడిగే ఏ ధ్రువపత్రాన్నైనా సమర్పించలేని పక్షంలో వాటిని అందించేందుకు తుది గడువు వరకు సమయం ఉంటుంది.
  • నామినేషన్లు వేసేటప్పుడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఊరేగింపులు నిర్వహించొద్దు.
  • రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుంది.
  • నామినేషన్‌ పరిశీలించేటప్పుడు అభ్యర్థి, ఎలక్షన్‌ ఏజెంట్‌, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొచ్చు. న్యాయవాదిని కూడా తీసుకెళ్లవచ్చు.
  • అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే, అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి మాత్రమే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news