కాంగ్రెస్‌కు మేలు చేసేందుకు టీడీపీ పోటీ చేయట్లేదు : KTR

-

KTR : కాంగ్రెస్‌ కు మేలు చేసేందుకు టీడీపీ పార్టీ పోటీ చేయట్లేదని ఆగ్రహించారు మంత్రి KTR. నిన్న మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వరంగల్ బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండడంపై మంత్రి కేటీఆర్ కీలక వాక్యాలు చేశారు.

‘కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే టిడిపి ఇక్కడ పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లోను ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ వైషమ్యాలు, విభేదాలు తెలంగాణకు పాకోద్దు. నిరసన తెలిపేందుకు ధర్నాచౌక్ ఉంది. ఇష్ట రీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిచ్చు పెట్టొద్దు’ అని తెలిపారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలోనే కాదు.. బెంగళూరు కూడా డిసైడ్ అవుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి కంపెనీలను బెంగళూరుకు తరలిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news