తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అందరికంటే ముందుగా అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ మరికొన్ని పార్టీలు రెండో విడుత వరకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇవ్వాలో రేపో కాంగ్రెస్ తుది జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
ఈ తరుణంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారానికి 40మంది స్టార్ క్యాంపెయినర్స్.. లిస్ట్‌లో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా జాతీయ నేతలు.. లిస్ట్‌లో రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరెడ్డి తదితరులు.. తెలంగాణలో ప్రచారానికి యోగి ఆదిత్య నాథ్, యడియూరప్ప.. బీజేపీ ప్రచార లిస్ట్‌లో విజయశాంతికి చోటు దక్కకపోవడం గమనార్హం. దీంతో విజయశాంతి పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది.